|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:39 PM
2026 టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఐసీసీ మధ్య సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ఐసీసీ తీరుపై పీసీబీ ఛైర్మన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీని బహిష్కరించే అవకాశం ఉందన్న సంకేతాలతో వివాదం ముదిరింది. ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ దేశ క్రికెట్ భవిష్యత్తునే మార్చేసే కఠినమైన ఆంక్షలు విధించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ వివాదానికి పీసీబీ ఛైర్మన్, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అయిన మోహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలే కారణం. గతంలో పాకిస్థాన్ మ్యాచ్‌ల కోసం హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించిన ఐసీసీ, ఇప్పుడు బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించడానికి నిరాకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది ఐసీసీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని నఖ్వీ ఆరోపించారు.
Latest News