|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:40 PM
అమెరికాలో ఏటా జరిగే అతిపెద్ద అబార్షన్ వ్యతిరేక ప్రదర్శన 'మార్చ్ ఫర్ లైఫ్ 2026'లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రసంగం చేశారు. "జీవితం ఒక వరం" అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. తన భార్య ఉషా వాన్స్ నాలుగోసారి గర్భం దాల్చారని, జులైలో తమ కుటుంబంలోకి మరో బాబు రాబోతున్నాడని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. "నేను చెప్పేదే చేస్తానని చెప్పడానికి ఇదే నిదర్శనం. అమెరికాలో మరిన్ని కుటుంబాలు, మరింత మంది పిల్లలు కావాలని నేను కోరుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.నేటి సమాజంలో వామపక్ష భావజాలం కలిగిన వారు పెళ్లి, పిల్లలు అనేవి జీవిత పురోగతికి ఆటంకాలని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని వాన్స్ విమర్శించారు. "పిల్లలు భారం కాదు.. వారు మన సంస్కృతికి ఆధారం. అబార్షన్లను ప్రోత్సహించే సంస్కృతి నుంచి జీవించే హక్కును గౌరవించే సంస్కృతి వైపు మనం వెళ్లాలి" అని పిలుపునిచ్చారు.
Latest News