ఎవ్వరికీ తలవంచం, ఒంటరిగానే పోటీ చేస్తాం.. టీవీకే విజయ్
 

by Suryaa Desk | Sun, Jan 25, 2026, 08:50 PM

టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటపై.. ఆ పార్టీ అధినేత విజయ్‌ను సీబీఐ దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించింది. మరోవైపు ఆయన నటించిన జననాయగన్ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో తన ప్రత్యర్థులకు గట్టి మెసేజ్ ఇచ్చారు టీవీకే విజయ్. ఇటీవల ఆ పార్టీకి విజిల్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిన సందర్భంగా మహాబలిపురంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. మరికొద్ది నెలల్లో తమిళనాడులో జరిగేది ఎన్నికల పోరు కాదని.. ప్రజాస్వామ్య యుద్ధమని పేర్కొన్నారు.


 కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి కేటాయించిన ‘విజిల్‌’ గుర్తును విజయ్ ఆవిష్కరించారు. రానున్న తమిళనాడు ఎన్నికల్లో సొంతంగానే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దానికి కావాల్సిన సైన్యం తమ వద్ద ఉందన్నారు. ఇది ఎన్నికల పోరు కాదని.. ప్రజాస్వామ్య యుద్ధంగా అభివర్ణించారు. అంతేకాకుండా అన్నాడీఎంకే ప్రత్యక్షంగా, డీఎంకే పార్టీ పరోక్షంగా బీజేపీకి సరెండర్‌ అయ్యాయని విమర్శించారు. ఈ పార్టీలు అన్నాను (తమిళనాడు మాజీ సీఎం సీఎం అన్నాదురై) మార్చిపోయాయని.. తమ పార్టీ పేరులో అన్నా ఉన్న పార్టీలు కూడా మర్చిపోయాయని ఎద్దేవా చేశారు. కానీ టీవీకే మాత్రం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గదని తేల్చి చెప్పారు. డీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు.


ఈ సందర్భంగా తాము ఎవ్వరికీ తలవంచమి, దేనికీ రాజీపడబోమని లేల్చి చెప్పారు. కలిసికట్టుగా ఉంటే విజయం తమదే అని పార్టీ నాయకులకు చెప్పారు. కాగా, అధికారంలో ఉన్న పార్టీలకు పోలింగ్ బూత్‌లు.. బోగస్ ఓటింగ్ కేంద్రాలుగా మారాయని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అవినీతి అంతానికి సమయం ఆసన్నమైందన్న విజయ్‌.. దుష్ట శక్తులను, అవినీతిపరులను ఎదుర్కొనే ధైర్యం తమ పార్టీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా టీవీకే యాత్ర..


రాష్ట్రవ్యాప్త ప్రచార యాత్రను సోమవారం (జనవరి 26) ప్రారంభించనున్నట్లు టీవీకే విజయ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ యాత్ర రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో సాగుతుందని వెల్లడించారు. కాగా, టీవీకే ఇంకా ఏ పార్టీతోనూ పొత్తును ప్రకటించలేదు. పొత్తులపై నిర్ణయం విజయ్ మాత్రమే తీసుకుంటారని టీవీకే నాయకులు చెబుతున్నారు. కాగా, టీవీకే, బీజేపీ మధ్య పొత్తు అంటూ ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Latest News
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
Mon, Feb 23, 2026, 03:33 PM
Mobile ban in Karnataka schools under discussion, parents also exerting pressure: Deputy CM Shivakumar Mon, Feb 23, 2026, 03:32 PM
Congress targets MP BJP govt over Ladli Behna Yojana Mon, Feb 23, 2026, 03:31 PM