|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 08:46 PM
కేరళలో క్రిస్మస్ - న్యూఇయర్ బంపర్ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. శనివారం నిర్వహించిన డ్రాలో ఎక్స్‌సీ 138455 అనే నంబరుకు మొదటి బహుమతిగా రూ.20 కోట్లు వరించింది. ఈ టికెట్‌ను కొట్టాయం జిల్లా కంజిరప్పల్లి బస్టాండు సమీపంలో దుకాణం నడుపుతున్న సుదీక్ అనే ఏజెంట్ విక్రయించారు. దీంతో ఆ టిక్కెట్ కొన్న వ్యక్తి వివరాల కోసం నిర్వాహకులు ఆరా తీస్తున్నారు. ఇక, ఈ ఏడాది క్రిస్మస్- నూతన సంవత్సరం బంపర్ లాటరీ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఏకంగా 54.08 లక్షలు మేర టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు అధికారులు తెలిపారు. గతేడాది 47.65 లక్షలతో పోల్చితే దాదాపు 16 శాతం అధికం. అయితే, ఒక్క పాలక్కాడ్ జిల్లాలోనే 15 లక్షల టికెట్లు కొనుగోలు చేయడం గమనార్హం.
బరువు పెరుగుతారన్న టెన్షన్ వద్దు, ఎటువంటి చింత లేకుండా తినగల 50 ఆహారాల్ని పంచుకున్న ఎక్స్‌పర్ట్, అవేంటో తెలుసా?
ఈ లాటరీ టికెట్లను 10 సిరీస్‌లలో ముద్రించి, రూ.400 ధరగా నిర్ణయించారు. రూ.20 కోట్లు లాటరీ గెలిచిన విజేతకు 10 శాతం ఏజెంట్ కమీషన్, 30 శాతం ఆదాయపు పన్ను మినహాయిస్తే రూ.12.4 కోట్లు చేతికి వస్తుంది. అలాగే, మరో 20 మందికి రెండో బహుమతి కింద రూ.కోటి చొప్పున, మరో 20 మందికి మూడో బహుమతిగా రూ.10 లక్షలు చొప్పున, నాలుగో బహుమతి కింద 20 మందికి చెరో రూ.3 లక్షలు, ఐదో బహుమతిగా మరో 20 మందికి చెరో రూ.2 లక్షలు అందజేయనున్నారు.
ΧΑ 226117, ΧΑ 528505, XB 182497, XB 359237, XB 413318, XC 103751, XC 203258, XC 239163, XC 312872, XC 362518, XD 241658, XD 286844, ΧΕ 130140, XJ 361121, XJ 407914, XJ 474940, XK 136517, XK 464575, XK 489087, XL 230208 అనే టిక్కెట్లు డ్రాలో రెండో బహుమతి గెలుపొందాయి.
కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలే లాటరీలు నిర్వహిస్తుంటాయి. ఇక, కేరళ సర్కారు క్రిస్మస్- న్యూఇయర్, విషుం, ఓణం వంటి సందర్భాల్లో బంపర్ లాటరీ తీస్తుంది. ఇక, డ్రాలో విజేతలు ముందుగా కేరళ సర్కారు గెజిట్‌లో ప్రచురించిన ఫలితాలను చూసుకుని ధ్రువీకరించుకోవాలి. లాటరీ క్లెయిమ్ చేయడానికి తమ టిక్కెట్లు, గుర్తింపు కార్డులతో తిరువనంతపురంలోని కార్యాలయాన్ని 30 రోజుల్లోగా సంప్రదించాలి. రూ. 10, 000 కంటే ఎక్కువ క్లెయిమ్ చేయడానికి, విజేతలు తమ గుర్తింపు పత్రాలు,టిక్కెట్లను బ్యాంకు లేదా ప్రభుత్వ లాటరీ కార్యాలయానికి సమర్పించాలి. రూ. 10,000 కంటే తక్కువైతే కేరళలోని ఏదైనా లాటరీ దుకాణం నుంచి ప్రైజ్ మనీని తీసుకోవచ్చు.
Latest News