|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 10:32 AM
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త ఉండొచ్చని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.1,000గా ఉన్న కనీస పెన్షన్‌ను పెంచే అవకాశముందని సమాచారం. 11 ఏళ్లుగా పెన్షన్‌లో మార్పు లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇతర ఉద్యోగి సంఘాలు కూడా కనీస పెన్షన్‌ను రూ.7 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. దీంతో బడ్జెట్‌లో పెన్షన్ పెంపుపై కేంద్రం కీలక ప్రకటన చేయవచ్చని అంచనా.
Latest News