|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:42 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీలపై సాగుతున్న దాడులు, అణచివేతలు పరాకాష్టకు చేరాయని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. మందా సాల్మన్‌ను దారుణంగా హత్య చేయడం కూడా చంద్రబాబు చేస్తున్న నరమేధంలో భాగమేనని ఆయన ఆరోపించారు.పరిపక్వత లేని నారా లోకేష్ తీసుకొచ్చిన ‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఈ తప్పుడు సంస్కృతితో పల్నాడు జిల్లాలోనే వందలాది కుటుంబాలపై దాడులు జరిగాయని తెలిపారు. కాపాడాల్సిన పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌కు అండగా ఉన్నారన్న కారణంతోనే దళితులపై కూటమి ప్రభుత్వం పగ పట్టిందని అన్నారు. దళితులకు పథకాలు ఇవ్వలేక, రక్షణ కల్పించలేని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడని వ్యాఖ్యానించారు.
Latest News