|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:44 PM
తొలిసారి రాజధాని అమరావతిలో గణతంత్ర దిన వేడుకలను నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకలు ప్రభుత్వ ప్రతిష్ఠను చాటేలా సాగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారిక గౌరవ వందనం స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, కర్నూల్ ఏపీఎస్పీ రెండో బెటాలియన్ సహా వివిధ భద్రతా దళాలు గవర్నర్‌కు గౌరవ వందనం అందించాయి.వేడుకల అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు.
Latest News