|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:51 PM
తన వ్యక్తిగత జీవితంపై రోజుకో పుకారు షికారు చేస్తున్న తరుణంలో తాజాగా యుజ్వేంద్ర చాహల్ మరో సెలబ్రిటీతో కనిపించడం చర్చనీయాంశమైంది.కొంతకాలంగా చాహల్ పేరు ఆర్జే మహ్వాష్‌తో బలంగా వినిపించింది. ధనశ్రీతో విడాకుల తర్వాత వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, గ్రౌండ్‌లో చాహల్‌ను ఆమె ఉత్సాహపరచడం చూసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ భావించారు. కానీ, సడన్‌గా వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. దానికి తోడు "నా జీవితాన్ని చక్కదిద్దుకుంటున్నాను" అని మహ్వాష్, "మౌనంగా ఉండటం తప్పు కాదు" అని చాహల్ పెట్టిన పోస్టులు వీరిద్దరి మధ్య బంధం ముగిసిందని స్పష్టం చేస్తున్నాయి.ఈ 'అన్‌ఫాలో' డ్రామా నడుస్తుండగానే శనివారం రాత్రి ముంబైలో బిగ్ బాస్ ఫేమ్, స్పోర్ట్స్ యాంకర్ షెఫాలీ బగ్గాతో కలిసి చాహల్ కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి డిన్నర్‌కు వెళ్లిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫొటోగ్రాఫర్లు కలిసి పోజు ఇవ్వమని అడిగితే చాహల్ సున్నితంగా తిరస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం గమనార్హం.
Latest News