|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:55 PM
‘సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభదినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు తెలిపారు. మనల్ని మనమే పాలించుకునేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజును ఘనంగా జరుపుకుందాం. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బలమైన పునాదులు వేసింది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి’ అంటూ సీఎం చంద్రబాబు సందేశం ఇచ్చారు.
Latest News