|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:57 PM
వైయస్సార్సీపీకి ఓటేస్తే చంపేస్తామన్న స్థాయిలో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. స్వేచ్ఛగా ఓటు వేసినందుకే దళితులను ఊచకోత కోసి చంపుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. హాయిగా బ్రతకాలంటే తుపాకీ లైసెన్సులు కావాల్సిన పరిస్థితి వస్తోందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాయాలని చూస్తున్నారని ఆరోపించారు.రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో దళితుల సత్తాను కూటమి ప్రభుత్వానికి చూపిస్తామని, వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్‌సీపీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. మందా సాల్మన్ హత్యను కోర్టులు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Latest News