|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:58 PM
తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడులు ఘనంగా జరిగాయి. పలువురు పార్టీ నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పార్టీ నాయకులంతా మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, అయన మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వ్యక్తిగత స్వార్థం, ప్రతిపక్షాలపై ద్వేషం, అధికారం ఉందనే అహంకారం, ఎల్లప్పుడూ తామే పదవుల్లో ఉండాలన్న ఆశతో కూటమి నాయకులు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. కొంతమంది పోలీసులు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అమాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనా స్ఫూర్తితో ఏర్పాటు చేసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యం పేదల పక్షాన నిలబడి పోరాడుతుంది. అన్నివర్గాలకు అండగా నిలబడుతుంది అని తెలిపారు.
Latest News