న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 01:09 PM

టీ20 ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా ఒక అరుదైన ప్రపంచ రికార్డును సమం చేసింది.అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా 11 సిరీస్‌లు గెలిచిన జట్టుగా పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును భారత్ ఇప్పుడు అందుకుంది. 2016-18 మధ్య కాలంలో సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలోని పాక్ జట్టు ఈ ఘనతను సాధించింది. ఇప్పుడు భారత్ ఆ రికార్డును సమం చేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో కూడా భారతే ఉంది. 2017-18లో వరుసగా ఏడు, 2019-21 మధ్య ఆరు సిరీస్‌లు గెలిచింది.2026లో టీ20 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో జట్టు ఈ స్థాయిలో రాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కివీస్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌ల తర్వాత సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని టీమిండియా ఇంగ్లండ్‌లో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్‌ను కూడా గెలిస్తే వరుసగా 12 విజయాలతో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది.

Latest News
India aspires to establish equitable maritime order: Rajnath Singh Thu, Feb 19, 2026, 04:17 PM
T20 WC: Sri Lanka opt to bat against Zimbabwe Thu, Feb 19, 2026, 03:57 PM
T20 WC: West Indies enter Super 8 unbeaten after 42-run win over Italy Thu, Feb 19, 2026, 03:47 PM
India AI Summit 'moment of pride' for Global South, says PM Modi; calls for responsible, ethical use Thu, Feb 19, 2026, 03:04 PM
Australian unemployment rate steady at 4.1 per cent Thu, Feb 19, 2026, 02:41 PM