కూటమి పాలనలో రైతుల్లో నమ్మకం పోయింది
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 01:14 PM

2025–26 ఖరీఫ్ సీజన్‌లో కంది  ఎంఎస్‌పీ  ఆధారంగా ప్రభుత్వ కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ ఉపాధ్యక్షుడు, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ సభ్యుడు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.వి.ఎస్. నాగిరెడ్డి  తెలిపారు.కేంద్ర ప్రభుత్వం Price Support Scheme (PSS) కింద ఆంధ్రప్రదేశ్‌కు 1,16,690 మెట్రిక్ టన్నుల కంది MSP కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని, అలాగే 903 మెట్రిక్ టన్నుల పెసలు, 28,440 మెట్రిక్ టన్నుల మినుములకు కూడా MSP కొనుగోలు ఆమోదం ఉందని ఆయన తెలిపారు. కంది MSP ధరను రూ.8,000 క్వింటాల్‌గా నిర్ణయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులు రూ.6,500 నుంచి రూ.7,000 మధ్యే పంటను విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.2025–26లో ఆంధ్రప్రదేశ్‌లో కంది సాగు సుమారు 3,21,743 హెక్టార్లలో జరిగినప్పటికీ, ప్రభుత్వం ప్రకటించిన MSP కొనుగోలు మొత్తం ఉత్పత్తిలో 25 శాతం కూడా కవర్ చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఎంతవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న స్పష్టత లేక రైతుల్లో నమ్మకం లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, పూర్తి స్థాయిలో కొనుగోలు జరగకపోవడంతో ప్రభుత్వం డబ్బులు త్వరగా చెల్లించదన్న భయంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. గతంలో పొగాకు, మామిడి, ఉల్లి రైతులకు చెల్లింపుల్లో జరిగిన జాప్యాలు రైతుల విశ్వాసాన్ని మరింత దెబ్బతీశాయని విమర్శించారు.

Latest News
India aspires to establish equitable maritime order: Rajnath Singh Thu, Feb 19, 2026, 04:17 PM
T20 WC: Sri Lanka opt to bat against Zimbabwe Thu, Feb 19, 2026, 03:57 PM
T20 WC: West Indies enter Super 8 unbeaten after 42-run win over Italy Thu, Feb 19, 2026, 03:47 PM
India AI Summit 'moment of pride' for Global South, says PM Modi; calls for responsible, ethical use Thu, Feb 19, 2026, 03:04 PM
Australian unemployment rate steady at 4.1 per cent Thu, Feb 19, 2026, 02:41 PM