|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 01:15 PM
రాష్ట్రాభివృద్ధిలో పార్లమెంట్ సభ్యుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు, ప్రాజెక్టులు సాధించడం ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై గట్టిగా గళం విప్పాలని, తమ నియోజకవర్గాల అభివృద్ధి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశం జరిగింది. జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపులపై ఎంపీలకు చంద్రబాబు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు మంత్రి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Latest News