|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 05:52 PM
మంగళగిరి మండల పార్టీ ఉపాధ్యక్షులు కొమ్మా సుకుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న నేపథ్యంలో, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆయనను పరామర్శించారు. ఆత్మకూరులో నూతన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం, మంత్రి లోకేష్ కొమ్మా సుకుమార్ కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొమ్మా సుకుమార్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Latest News