లివ్-ఇన్ రిలేషన్స్ లో అత్యాచార ఆరోపణలు చెల్లవన్న హైకోర్టు
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 05:56 PM

లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యువతలో పెరుగుతున్న ఈ ధోరణితో తలెత్తుతున్న న్యాయపరమైన చిక్కులపై కోర్టు ఘాటుగా స్పందించింది. రిలేషన్‌షిప్ బ్రేక్ అయినప్పుడు మహిళలు అత్యాచార ఆరోపణలు చేయడం ట్రెండ్‌గా మారిందని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉన్నా, అవి లివ్-ఇన్ రిలేషన్‌షిప్ లేని కాలంలో రూపొందించబడ్డాయని గుర్తు చేసింది. చంద్రేష్ అనే వ్యక్తిపై కిడ్నాప్, అత్యాచారం ఆరోపణలపై జీవిత ఖైదు విధించిన కేసులో, బాధితురాలు మేజర్ అని, ఆమె ఇష్టపూర్వకంగానే నిందితుడితో వెళ్లినందున ఆరోపణలు చెల్లవని తేల్చి చెప్పింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ ఫెయిల్ అయిన ప్రతిసారీ దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ, చంద్రేష్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.

Latest News
Pakistan increases price of petrol by PKR 5, high-speed diesel by PKR 7.32 Mon, Feb 16, 2026, 03:57 PM
India, Greece discuss enhancing maritime cooperation Mon, Feb 16, 2026, 03:54 PM
AI Impact Summit 2026 puts India on global AI map: Raghav Chadha Mon, Feb 16, 2026, 03:40 PM
Auditors are custodians of public trust: President Murmu Mon, Feb 16, 2026, 03:38 PM
The game was out of Pakistan's reach once India reached 175: Waqar Younis Mon, Feb 16, 2026, 03:36 PM