కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 07:05 PM

నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తన జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ గౌరవం కేవలం తనకు మాత్రమే కాదని తెలుగు హాస్యానికి వినోదాన్ని ఆస్వాదించే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కళలను గౌరవించి తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.గత 48 ఏళ్లుగా ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమే ఈ స్థాయి గుర్తింపునకు కారణమని ఆయన అన్నారు.నాలాంటి నటుడిని మీ ఇంటి మనిషిలా ఆదరించి నటకిరీటి'ని చేసి ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తనను ఎప్పుడూ నవ్విస్తూ ఉండమని దీవించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

Latest News
Pakistan increases price of petrol by PKR 5, high-speed diesel by PKR 7.32 Mon, Feb 16, 2026, 03:57 PM
India, Greece discuss enhancing maritime cooperation Mon, Feb 16, 2026, 03:54 PM
AI Impact Summit 2026 puts India on global AI map: Raghav Chadha Mon, Feb 16, 2026, 03:40 PM
Auditors are custodians of public trust: President Murmu Mon, Feb 16, 2026, 03:38 PM
The game was out of Pakistan's reach once India reached 175: Waqar Younis Mon, Feb 16, 2026, 03:36 PM