|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 10:35 AM
బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలను ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తూ, రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని ఎగ్గొడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2015లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్ సీబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ ఐ, ఐఎన్ బీఈఎఫ్, ఐఎన్ బీఓసీ, ఎన్ ఓబీడబ్ల్యూ, ఎన్ఓబీఓ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ (యూఎఫ్ బీవో) పాల్గొంటున్నాయి.
Latest News