అన్ని వర్గాలకు సమానత్వం చూపాల్సిన ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది
 

by Suryaa Desk | Tue, Jan 27, 2026, 11:00 AM

గణతంత్ర దినోత్సవ ఫలితాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. రాజ్యాంగాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏపీలో రాజ్యాంగానికి విలువ,గౌరవం లేకుండా పోయిందని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నిన్న విజయవాడ బీసెంట్ రోడ్డులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.  ఈ సందర్భంగా మల్లాది విషు​.. జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సామాజిక సమతుల్యత పాటించాల్సిన ప్రభుత్వం.. ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా పనిచేయడం లేదని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రజలకు స్వాతంత్ర ఫలాలను ప్రజలకు చేరువ చేశాం.. కానీ 20 నెలల కూటమి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు’’ అని మల్లాది విష్ణు అన్నారు.

Latest News
Kerala first to frame comprehensive Urban Policy Fri, Feb 13, 2026, 04:59 PM
Sensex, Nifty dip around 1.25 pc; metal stocks lead losses Fri, Feb 13, 2026, 04:50 PM
India can cross 10 per cent GDP: Uniphore CEO ahead of AI Impact Summit Fri, Feb 13, 2026, 04:49 PM
Bangladesh: Around 68 per cent pressed 'yes' in favour of July Charter Referendum, confirms EC Fri, Feb 13, 2026, 04:42 PM
ED officer transferred after summoning Capt Amarinder Singh, his son in FEMA case Fri, Feb 13, 2026, 04:34 PM