|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 11:00 AM
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ను తప్పుడు ఆధారాలతో అక్రమంగా అరెస్టు చేసి 83 రోజులు జైలులో ఉంచారని విడదల రజనీ ఆరోపించారు. ఇంతటి అన్యాయం మరొకటి లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. జోగి రమేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టారని, ఆసుపత్రిలో కలిసేందుకు వెళ్లినందుకే ఆయన భార్యపై కేసు పెట్టడం దుర్మార్గమని అన్నారు. అరెస్టులు చేసి జైళ్లకు పంపి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ నేతల గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఈ అరాచకాలను గమనిస్తున్నారని, సామాన్యులకు సైతం న్యాయం జరగని పరిస్థితి ఉందన్నారు. అరెస్టులు, కేసులే మీకు గుణపాఠం చెప్పబోతున్నాయని హెచ్చరించారు. వైయస్ఆర్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని, వాటిని అమ్మేయడానికి పెద్ద స్కెచ్ వేస్తున్నారని ధ్వజమెత్తారు. తనను, తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని, రెడ్ బుక్ పేరుతో భయపెట్టాలని చూసినా తాము భయపడలేదని స్పష్టం చేశారు. మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే తమ ఏకైక అజెండా అని విడదల రజనీ స్పష్టం చేశారు.
Latest News