|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 11:09 AM
తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అడ్డంపెట్టుకుని వైయస్ఆర్‌సీపీని దెబ్బతీయాలని చంద్రబాబు ప్రయత్నించాడని, తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేశారని అంబటి రాంబాబు తప్పుపట్టారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిని దశలవారీగా తనిఖీ చేస్తారని, కల్తీ లేదని నిర్ధారించిన తర్వాతే వినియోగిస్తారని వివరించారు. వెంకటేశ్వర స్వామిని అడ్డంపెట్టుకుని నీచమైన రాజకీయాలు చేశారని, భవిష్యత్తులో చంద్రబాబు తప్పక అనుభవిస్తాడని హెచ్చరించారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టే అర్హత చంద్రబాబుకు లేదని, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలో నుంచి దించేసిన వ్యక్తి ఆయనేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రామారావును అడ్డంపెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడన్నారు. సంక్రాంతి సందర్భంగా తాను చేసిన నృత్యం ఆనంద తాండవమని, రాజకీయ వ్యంగ్యంతో చేసిన ఆ నృత్యాన్ని ప్రజలు ఆదరించారని చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా తాను డాన్స్ చేశానని, తిట్టినా గేలి చేసినా భయపడని వ్యక్తినని, వైయస్ఆర్ శిష్యుడిగా, వైయస్ జగన్ సహచరుడిగా ఎప్పటికీ ప్రజల పక్షానే ఉంటానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
Latest News