|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 01:58 PM
రైలు ఆలస్యం కారణంగా బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష రాయలేకపోయిన సమృద్ధి అనే విద్యార్థినికి భారతీయ రైల్వే రూ.9 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ ఆదేశించింది. 2018లో ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి, లక్నోలో పరీక్ష రాయడానికి ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించింది. రైలు రెండున్నర గంటలు ఆలస్యం కావడంతో ఆమె పరీక్షకు హాజరు కాలేకపోయింది, దీంతో ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయింది. ఏడేళ్ల న్యాయపోరాటం తర్వాత విద్యార్థినికి పరిహారంగా రైల్వే శాఖ రూ.9 లక్షలు చెల్లించాలని ఫోరమ్ ఆదేశించింది.
Latest News