|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:02 PM
రిపబ్లిక్ డే వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను అవమానించారని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఇందిరాభవన్‌లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో పాల్గొన్న ఆమె, బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం చేతకాదని, రాజ్యాంగ విలువలను విస్మరిస్తోందని మండిపడ్డారు. నిండు సభలో మహాత్మా గాంధీ, డా. బీఆర్ అంబేద్కర్‌లను అవమానించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, సోదరభావం కోసం రాహుల్ గాంధీ మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.దేశంలో బీజేపీ అనే చీకటి నుంచి కాంగ్రెస్ అనే వెలుగు ప్రజలకు కనిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నిన్న కొన్ని రాష్ట్రాల పీసీసీలతో సమావేశాలు జరిగాయని, పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
Latest News