|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:06 PM
గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంఘటన మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది.వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడుకు చెందిన పెరుగు అమర్ బాబు ఈ నెల 24న తాడికొండ మండలం నిడుముక్కలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే గుంటూరులోని ఆస్టర్ రమేశ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో జీవన్‌దాన్ కో ఆర్డినేటర్లు అమర్ తల్లి కోటేశ్వరికి అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. కన్నీటి పర్యంతమైనప్పటికీ ఆమె తన కొడుకు అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు.సోమవారం వైద్యులు అవయవాల సేకరణ ప్రక్రియను చేపట్టారు. అమర్ గుండెను తిరుపతి పద్మావతి ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించారు. కాలేయం, ఒక కిడ్నీని గుంటూరు రమేశ్ ఆసుపత్రికి, మరో కిడ్నీని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి, రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి అందించారు. ఈ అవయవదానం ద్వారా మొత్తం ఆరుగురు కొత్త జీవితాన్ని పొందారు.
Latest News