|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:08 PM
అమెరికా సైనిక మద్దతు లేకుండా యూరప్ తనను తాను రక్షించుకోగలదని భావిస్తే, అది పగటి కలలు కనడమేనని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటె సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరప్ భద్రత విషయంలో వాస్తవికంగా ఉండాలని, అమెరికాపై ఆధారపడటం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.సోమవారం బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్‌లో భద్రత, విదేశీ వ్యవహారాల కమిటీల సభ్యులను ఉద్దేశించి మార్క్ రూటె ప్రసంగించారు. "అమెరికా లేకుండా యూరప్ తనను తాను కాపాడుకోగలదని ఇక్కడ ఎవరైనా అనుకుంటే, వారు ఆ కలలు కంటూనే ఉండవచ్చు. కానీ అది సాధ్యం కాదు" అని ఆయన తేల్చి చెప్పారు. ఇటీవలి కాలంలో గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా విధానం, కూటమి సభ్య దేశాల సహకారంపై నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రూటె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Latest News