|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:16 PM
భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఖరారైంది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు. ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాలతో జరిగిన 16వ శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు.ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి జరిగే 97 శాతం ఎగుమతులపై సుంకాలు రద్దు కానున్నాయి. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, రత్నాలు, లెదర్ వంటి రంగాలకు ఇది భారీ ఊతాన్ని ఇవ్వనుంది. అదే సమయంలో యూరప్ కార్లు, యంత్ర పరికరాలకు భారత మార్కెట్‌లోకి ప్రవేశం సులభతరం అవుతుంది. "ఈరోజు యూరప్, భారత్ చరిత్ర సృష్టిస్తున్నాయి. మేం 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'ను ముగించాం. ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూర్చేలా 200 కోట్ల మంది ప్రజలతో స్వేచ్ఛా వాణిజ్య క్షేత్రాన్ని సృష్టించాం" అని ఉర్సులా 'ఎక్స్' వేదికగా తెలిపారు.
Latest News