|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:21 PM
టీ20 ప్రపంచకప్-2026 ప్రారంభానికి ముందే వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ జట్టు భాగస్వామ్యంపై సందిగ్ధత కొనసాగుతుండగా, ఇప్పుడు బంగ్లాదేశ్ మీడియా ప్రతినిధులపై ఐసీసీ తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపుతోంది. టోర్నీ కవరేజీ కోసం అనుమతి కోరిన సుమారు 150 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఇచ్చేందుకు ఐసీసీ నిరాకరించినట్లు సమాచారం.ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను టోర్నీకి దూరం పెట్టడం వెనుక భౌగోళిక రాజకీయ కారణాలతో పాటు భద్రతాపరమైన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అవకాశం ఉన్న వారికే అనుమతి నిరాకరించినట్లు ఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సంకేతం. అయితే, దీనిపై ఐసీసీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.ఐసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రీడా జర్నలిస్టుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ దేశం నుంచి వెళ్లే జర్నలిస్టులపై వివక్ష చూపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. "అవసరమైన అన్ని పత్రాలు సమర్పించినప్పటికీ, ఎటువంటి కారణం చూపకుండానే అక్రెడిటేషన్లను తిరస్కరించడం భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమే" అని వారు వాదిస్తున్నారు.
Latest News