|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 06:36 PM
AP: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం తీరంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నేవీ మాజీ అధికారి బలరాం నాయుడు నేతృత్వంలో ఐదుగురు స్కూబా డైవర్లు 77 అడుగుల లోతులో సముద్ర గర్భంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ ప్రదర్శనలో ఇద్దరు డైవర్లు గుర్రంపై స్వారీ చేస్తున్నట్లుగా వినూత్న ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ధైర్యం, క్రమశిక్షణ, రాజ్యాంగం పట్ల గౌరవాన్ని చాటేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు బలరాం నాయుడు తెలిపారు.
Latest News