బడ్జెట్‌ 2026-27.. నార్త్‌ బ్లాక్‌లో హల్వా వేడుక
 

by Suryaa Desk | Tue, Jan 27, 2026, 06:40 PM

ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ రూపకల్పన పనులు తుది దశకు చేరుకున్నాయని సూచిస్తూ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో మంగళవారం హల్వా వేడుక జరిగింది. హల్వా వేడుకతో బడ్జెట్ లాక్-ఇన్​పీరియడ్ (Lock-in period) ప్రారంభం అవుతుంది. అంటే బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌లో వార్షిక పద్దు (Budget 2026-27)ను ప్రవేశపెట్టేవరకు ఆ నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి వీలుండదు. వారు ఎల్లప్పుడూ సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారు. కనీసం వారు ఫోన్ చేయడానికి కూడా వీలుండదు. ఒకసారి పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన తర్వాతే వీరు బయటకు వస్తారు. అంటే ఐదురోజులపాటు వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవన్నమాట. 1950లో బడ్జెట్ ముద్రణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో లీక్ అవ్వడంతో ఈ లాక్‌-ఇన్‌ నిర్ణయం తీసుకున్నారు.

Latest News
'I & CM Siddaramaiah know what we spoke': DK Shivakumar on K'taka Congress 'crisis' Tue, Feb 10, 2026, 11:41 AM
Precious metal prices decline amid profit booking, stronger dollar Tue, Feb 10, 2026, 11:35 AM
T20 WC: Klaassen, van der Gugten come in as Netherlands elect to bowl first against Namibia Tue, Feb 10, 2026, 11:32 AM
Zero US tariff on diamonds and gemstones a major step forward: GJC's Avinash Gupta Tue, Feb 10, 2026, 11:28 AM
One minute into proceedings, LS adjourned amid Oppn uproar Tue, Feb 10, 2026, 11:22 AM