|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 06:46 PM
AP: మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రాంతీయ ఆసుపత్రుల్లో 13 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ లేబొరేటరీలలో 134 రకాల పరీక్షలు నిర్వహించబడతాయని చెప్పారు. ఆసుపత్రులకు వచ్చే రోగులతో పాటు పీహెచ్‌సీ, ఇతర ఆసుపత్రుల రోగులను కూడా ఇక్కడికి రిఫర్ చేస్తారని తెలిపారు. వ్యాధుల కారణాలను గుర్తించడం, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.16.25 కోట్ల నిధులను వెచ్చిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు
Latest News