కోడిగుడ్లని ఫ్రిజ్‌లో వచ్చే ట్రేలో పెట్టి స్టోర్ చేస్తున్నారా
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 11:02 PM

తక్కువ ఖర్చుతో పోషకాహారం తినాలనగానే ముందుగా గుర్తొచ్చేది కోడిగుడ్లు. తక్కువ ధరలోనే దొరికే ఈ ఎగ్స్‌లో ఎన్నో పోషకాలు, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. త్వరగా, ఈజీగా క్షణాల్లోనే వీటితో వంటలు చేయొచ్చు. పైగా ఆరోగ్యానికి కూడా మంచివి. చిన్నాపెద్దా తేడా లేకుండా రోజుకో గుడ్డు తినాలని చెబుతారు. అందుకని, రోజుకి షాప్‌కి వెళ్లి కొనుక్కుని రాలేం కదా. అలాంటప్పుడు ఎలా కొని స్టోర్ చేస్తే ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి. వాటిని ఫ్రిజ్‌లో కూడా ఎలా స్టోర్ చేస్తే ఫ్రెష్‌గా ఉంటాయో ముందుగా న్యూట్రిషనిస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఆ వివరాలేంటంటే


కోడిగుడ్లని స్టోర్ చేయడం


​కోడిగుడ్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేయడం అవసరం వచ్చినప్పుడు తీసుకోవడం కాదు. వాటిని సరైన విధంగా, ఎలా స్టోర్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. లేదంటే, వాటి తాజాదనాన్ని మనకి తెలియకుండా మనమే పాడుచేసినవారవుతాం. అందుకే, వాటిని వాడేముందుగా ఓ సారి చెక్ చేసి వాడాలి. వాటి తాజాదనాన్ని చెక్ చేసి ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉండేందుకు ఏం చేయాలంటే


ఫ్రెష్‌నెస్ చెక్ చేసేందుకు


కోడిగుడ్లు తాజాగా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ముందుగా ఓ గ్లాసులో కోడిగుడ్లని వేయండి. అవి నేరుగా కిందకి వెళ్తే అవి తాజా గుడ్లు అని అర్థం. అలా కాకుండా కోడిగుడ్లు నీటిపై తేలుతూ ఉంటే అవి చాలా రోజులుగా ఉన్నట్లు అర్థం. అలాంటి గుడ్లని తినకపోవడమే మంచిది.


2, 3 రోజులు స్టోర్ చేయడానికి


చాలా మంది కోడిగుడ్లని తీసుకొచ్చి ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. వీటిని బయట అలా ట్రేలో పెట్టేస్తారు. అది ఫ్రిజ్ డోర్‌కి అటాచ్ అయి ఉంటుంది. కానీ, ఈ ప్లేస్‌లో టెంపరేచర్ సరిగా ఉండదు. అలా కాకుండా ప్రిజ్‌లో స్టోర్ చేయాలంటే ఎప్పుడైనా సరే మధ్య షెల్ఫ్‌లో పెట్టాలి. అప్పుడే ఫ్రిజ్ టెంపరేచర్‌కి గుడ్లు తేడాగా మారడం జరగదు.


ఉల్లి, వెల్లుల్లితో కలిపి స్టోర్ చేయడం


చాలా మంది కోడిగుడ్లని ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి వాటితో కలిపి స్టోర్ చేస్తుంటారు. ఇలా చేయొద్దు. ఘాటైన మసాలాలు, ఉల్లిపాయలు, సీ ఫుడ్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ వంటి వాటితో వాటిని సరిగ్గా కవర్ చేయకుండా స్టోర్ చేస్తే వాటిలోని ఘాటు వాసన కోడిగుడ్లని పాడయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా కోడిగుడ్లు ఆ పదార్థాల నుంచి విడుదలయ్యే గ్యాసెస్, వాసనల్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. తర్వాత వీటిని తినలేం.


కోడిగుడ్లని సరైన విధంగా ఎలా స్టోర్ చేయాలి?


గుడ్లు వాడే ముందు


గుడ్లని కొని తీసుకొచ్చి వాడేముందు ఈ టిప్స్ అన్నింటిని ఫాలో అవ్వండి. అప్పుడే అవి పాడవ్వకుండా ఉంటాయి. ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి. అంతేకాకుండా, ఇష్టమొచ్చినట్లుగా స్టోర్ చేస్తే వాటి నాణ్యత పాడవుతుంది. అదే విధంగా, సాధ్యమైనంత వరకూ తీసుకొచ్చిన కోడిగుడ్లు సాధ్యమైనంత వరకూ త్వరగా వాడండి. ఇలా చేస్తే వాటిలోని పోషకాలన్నింటిని పొందొచ్చు.

Latest News
Theegala seals second straight Top-10 finish at Farmers Insurance Open Mon, Feb 02, 2026, 05:02 PM
IMF lowers Pakistan's GDP growth forecast to 3 per cent Mon, Feb 02, 2026, 05:01 PM
Karnataka government should deal with issue of illegal Bangladeshis in state with an iron hand: Ashoka Mon, Feb 02, 2026, 04:59 PM
Budget sustains reform momentum through people-centric approach: KPMG in India CEO Mon, Feb 02, 2026, 04:48 PM
CBI raids 35 global cybercrime hotspots in 9 states, arrests key operative Mon, Feb 02, 2026, 04:46 PM