ఆకుకూర ఎలా తీసుకుంటేవైట్ హెయిర్ తగ్గి వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయంటే
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 11:04 PM

ఒత్తిడి పెరగడం, సరిలేని కేర్, పోషకాలలోపం, ఇతర కారణాల వల్ల నేటి కాలంలో జుట్టు రాలడం దగ్గర్నుంచీ తెల్లజుట్టు అనేది చాలా కామన్‌గా మారింది. దీనిని తగ్గించుకోవాలని ఎన్నో ఇన్‌స్టంట్ మార్గాలని వెతుకుతారు. అయితే, ఇవన్నీ కూడా డబ్బు ఖర్చుతో కూడుకున్నవి. పైగా అంత మంచివి కావు. ఇలాంటి సమస్యని దూరం చేసేందుకు నేచురల్ పద్ధతిని వాడొచ్చు. దీని గురించి న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. అదే ఆకుకూర అయినా సోయకూర తినడం. దీనిని హిందీ షెపు అంటారు. దీనిని మన డైట్‌లో యాడ్ చేస్తే నేచురల్‌గానే సమస్య తగ్గుతుందని రుజుతా చెబుతున్నారు. వివరాలేంటో మనమూ తెలుసుకుందాం.


సోయకూర ఎలా పనిచేస్తుంది


ఈ ఆకుకూరలో ఎక్కువగా ఫ్లేవనాయిడ్స్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. ఇవన్ని జుట్టు సమస్యల్ని దూరం చేస్తాయి. జుట్టు రాలకుండా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించి, నిద్ర నాణ్యతని మెరుగ్గా చేస్తుంది. నిద్ర సమస్యల కారణంగా ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా, జుట్టు సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి, ముందుగా ఆ సమస్యలు దూరం చేసుకోవడం.


ఒత్తిడి కారణంగానే తెల్లజుట్టు


ఒత్తిడి పెరగడం వల్లే నిద్రలేమి సమస్య వస్తుంది. దీంతోనే జుట్టు రాలడం, తెల్లజుట్టు సమస్యలు వస్తాయి. అయితే, మనం ఈ సోయకూరని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. తెల్లజుట్టు కూడా దూరమవుతుంది. జుట్టుకూడా అందంగా మారుతుంది.


రెగ్యులర్‌గా తింటే


సోయకూరని మనం డైట్‌లో యాడ్ చేసుకుంటే అలసట తగ్గుతుంది. శక్తి పెరుగుతుంది. మొత్తం ఆరోగ్యానికే చాలా మంచిది. బాడీ లోపలి నుండి బలంగా ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ జుట్టుని బలంగా చేస్తుంది. సోయాని రెగ్యులర్‌గా తీసుకుంటే జుట్టు కూడా బలంగా, ఆరోగ్యంగా మారుతుందని డాక్టర్ రుజుతా చెబుతున్నారు.


ఎలా తినొచ్చు?


ఈ ఆకుకూరలోని పోషకాలు అందాలంటే విటమిన్ సి, విటమిన్ బి12లు ఎక్కువగా ఉంటాయి. వీటిని మనం పప్పుల్లో వేసుకోవచ్చు. లేదా పరాఠాల్లా కూడా వేసుకుని తీసుకొచ్చు. కూర, పెరగులో కలిపి తినొచ్చు. ముఖ్యం ఉసిరికాయ పచ్చడితో తినొచ్చు. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అదే విధంగా, పెరుగులో విటమిన్ బి12 ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ మీ జుట్టుపై మెడిసిన్‌లా పనిచేసి జుట్టు సమస్యల్ని దూరం చేస్తుంది.


తెల్లజుట్టుని తగ్గించే సోయకూర


వీటితో పాటు


సలాడ్స్, మిగతా ఆకుకూరలు, రొట్టెలు, పరాఠాలు ఇలా ఎలా అయినా మీకు వీలున్నట్లుగా ఆకుకూరని ఆయా వంటల్లో వేసి వండుకుని తినొచ్చు. దీని రుచి బాగుండడమే కాకుండా, పోషకాలు పెరిగి జుట్టుకి మేలు చేస్తాయి.

Latest News
Rahul Gandhi raises Ladakh standoff issue again in LS, house adjourned for 2nd time Mon, Feb 02, 2026, 04:06 PM
Finland–India trade could double to 6 billion euros by 2032: Ambassador Mon, Feb 02, 2026, 04:00 PM
'People will feel they are scared of facing India', says Kaneria on Pakistan's decision to boycott T20 WC game Mon, Feb 02, 2026, 03:55 PM
Pakistan launches first nationwide polio vaccination drive of 2026 Mon, Feb 02, 2026, 03:46 PM
Union Budget charts confident path to Viksit Bharat despite tariff-trade wars: K'taka BJP chief Mon, Feb 02, 2026, 03:43 PM