|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:31 PM
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల ఆదాయం, సామాజిక భద్రత ఆందోళనకరంగా ఉందని ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. దాదాపు 40 శాతం మంది గిగ్ వర్కర్లు నెలకు రూ.15వేల కంటే తక్కువ సంపాదిస్తున్నారని, ఇది వారి జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని సర్వే పేర్కొంది. ఆల్గారిథమ్ కంట్రోల్స్, ఆర్డర్ కోసం వేచి ఉండే సమయానికి చెల్లింపు లేకపోవడం వంటి సమస్యలను సర్వే గుర్తించింది. గిగ్ వర్కర్లకు శిక్షణ, పరికరాల కొనుగోలులో కో-ఇన్వెస్ట్‌మెంట్, సామాజిక భద్రత, పారదర్శక వేతనాలు, చట్టపరమైన గుర్తింపు కల్పించాలని సర్వే సూచించింది. 2029-30 నాటికి గిగ్ వర్కర్ల సంఖ్య పెరిగి రూ.2.35 లక్షల కోట్ల జీడీపీని అందించే అవకాశం ఉందని అంచనా వేసింది
Latest News