|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 10:19 AM
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన, హోలీ పౌర్ణమి రోజున సంభవించనుంది. ఇది మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుంది. భూమి సూర్యుడు, చంద్రుడికి మధ్యలోకి వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూసివేయనున్నారు. 2026లో మొత్తం రెండు చంద్రగ్రహణాలు ఏర్పడతాయని, రెండోది ఆగస్టు 28న ఉంటుందని ఖగోళ నిపుణులు తెలిపారు.భారతదేశ కాలమానం ప్రకారం ఇది పగటిపూట ప్రారంభమవుతున్నప్పటికీ, సాయంత్రం సమయంలో చంద్రోదయం తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. గ్రహణ సమయం ముగిసే వరకు ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో శుభకార్యాలు నిషిద్ధంగా భావిస్తారు.
Latest News