|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 10:29 AM
అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. గత నెలలో కిలో 60 రూపాయలు పలికిన టమోటా ఇప్పుడు కిలో రూపాయికి కూడా కొనేవారు కరువయ్యారు. బయట ప్రాంతాలలో, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమోటా సాగు అధికంగా ఉండటంతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దిగుబడి పెరగడంతో మదనపల్లి మార్కెట్‌కు ధరలు పడిపోయాయి. దీంతో చేతికవచ్చిన పంటను ఏం చేసుకోవాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు.బయట ప్రాంతాలలో కూడా టమాటా సాగు అవుతూ ఉండడంతో మదనపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. రెండు వారాలుగా నాణ్యమైన టమాటా కిలో 15 రూపాయలు పలికితే ఇప్పుడు 7 రూపాయలకు పలుకుతోంది. మూడో రకం టమాటా కిలో ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటని ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడ్డారు రైతులు. ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి కారణం పక్కనే ఉండే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటో భారీగా సాగు అవుతూ ఉండడమే. దీంతో టమోటా కొనేందుకు ఏపీకి ఎవరూ రావడం లేదు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ టమోటా పంట బాగా దిగుబడి రావడంతో అక్కడ వ్యాపారులు మదనపల్లి వైపు చూడడం లేదు. దీంతో మదనపల్లె మార్కెట్ కు టమాటా విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు ట్రాన్స్పోర్ట్ కూలీ ఖర్చులు కాదు కదా తిరుగు ప్రయాణం చార్జీలకు కూడా డబ్బులు రావడం లేదు.
Latest News