|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 10:50 AM
పాన్‌మసాలా, సిగరెట్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్నులు విధించే అవకాశం ఉందని PTI నివేదిక వెల్లడించింది. GST పరిహార సెస్‌కు బదులుగా ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్‌ను నోటిఫై చేసినట్లు సమాచారం. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, వర్తించే GST రేట్లకు అదనంగా పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ విధించనున్నారు. ఈ నిర్ణయంతో పాన్‌మసాలా, సిగరెట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.కేంద్రం నోటిఫికేషన్‌తో సిగరెట్ (Cigarettes) కంపెనీలైన ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి ఆ ఉత్పత్తుల ధరలు పెరగనుండటంతో అమ్మకాలు తగ్గనున్నాయనే అంచనాల నేపథ్యంలో ఈ స్టాక్స్ నష్టపోయాయి. బీఎస్‌ఈలో ఐటీసీ షేరు ధర 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. ఫిలిప్స్ షేరు 10 శాతం కుంగింది
Latest News