|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 11:18 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఒక ఫోటోగ్రాఫర్ నుండి ఊహించని అనుభవం ఎదురైంది. ట్రంప్ భార్య మెలానియా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'మెలానియా' డాక్యుమెంటరీ సినిమా ప్రీమియర్ వేడుకలో ఫోటోగ్రాఫర్లు ఆమెను ఫోటోలు తీస్తుండగా ఈ ఘటన జరిగింది. రెడ్ కార్పెట్‌పై దంపతులు ఫోటోలకు పోజులిస్తుండగా, ఒక ఫోటోగ్రాఫర్ కేవలం మెలానియా 'సోలో' ఫోటో కావాలని కోరుతూ ట్రంప్‌ను పక్కకు తప్పుకోవాలని అడిగారు. దీంతో ట్రంప్ అసహనంగా పక్కకు జరగగా, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి ఏకంగా 40 మిలియన్ డాలర్లు ఖర్చు కాగా, దీని ప్రమోషన్, పంపిణీ కోసం అమెజాన్ మరో 35 మిలియన్ డాలర్లు వెచ్చించడం వివాదానికి దారితీసింది. సాధారణంగా ఇలాంటి చిత్రాలకు పదో వంతు బడ్జెట్ కూడా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి మెలానియా ట్రంప్ స్వయంగా పెయిడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. దీంతో సినిమాలో ఏ సన్నివేశాలు ఉండాలి, వేటిని తొలగించాలనే దానిపై ఆమెకు పూర్తి నియంత్రణ లభించింది. ట్రంప్ సర్కార్‌ను ప్రసన్నం చేసుకునేందుకే అమెజాన్ ఇంత భారీగా ఖర్చు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Latest News