|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 11:24 AM
కూటమి ప్రభుత్వంలో జనసేనకు అన్యాయం జరుగుతోందని, కూటమి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. పదవుల విషయంలో 60-30-10 విధానం కాగితాలకే పరిమితమైందని, దేవాలయ కమిటీల్లో జనసేనకు ప్రాతినిధ్యం లేదని, విశాఖ ఈస్ట్‌లో ఏర్పాటు చేసిన ఐదు దేవాలయ కమిటీల్లో ఒక్కటి కూడా జనసేనకు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.అయితే, స్థానిక ఎన్నికలకు ముందు జోక్యం అవసరమని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జనసేన త్యాగానికి గౌరవం ఇవ్వాలి అని కోరారు. గతంలో పార్టీ కమిటీల వ్యవహారంలో రోడ్డుపై కొచ్చి ప్రశ్నించిన కొవ్వూరు ఇన్చార్జ్ ని పదవి నుంచి తప్పించిన పార్టీ అధిష్టానం.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే అనుకున్న ఒప్పందం, జాయింట్ అగ్రిమెంటు అమలు జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, పార్టీ కోసం పని చేయని వారికి పార్టీ పేరు చెప్పి పదవులు ఇచ్చేశారని బొలిశెట్టి అన్నారు. ఇలాంటి వ్యవహారం క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుంది.. పార్టీ అధినాయకులకు తెలిసి ఇదంతా జరుగుతుందని అనుకోవడం లేదు.. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి జనసేనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని స్వయంగా ఫిర్యాదులు వస్తున్నాయి..
Latest News