|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 01:55 PM
AP: విశాఖలో గీతం యూనివర్సిటీకి చెందిన సుమారు 54.79 ఎకరాల భూముల క్రమబద్ధీకరణకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే ఈ అంశంపై చర్చ లేకుండానే మేయర్ పీలా శ్రీనివాసరావు అజెండాలోని అంశాలను ఆమోదించడంతో తీవ్ర వివాదం చెలరేగింది. వైసీపీ, కమ్యూనిస్టు సభ్యులు నల్ల కండువాలు ధరించి నిరసనకు దిగారు. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాట చోటుచేసుకుని రణరంగంగా మారింది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విపక్షాలు విమర్శించాయి.
Latest News