|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 01:56 PM
నాన్న రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ, మొదటి భార్య కుమార్తెకు భరణం ఇవ్వాల్సిందేనని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 25 ఏళ్ల యువతి తన తండ్రిపై దాఖలు చేసిన కేసులో, హైకోర్టు హిందూ దత్తత, భరణం చట్టం, 1956లోని సెక్షన్లను ప్రస్తావిస్తూ.. కన్యాదానం ఒక పవిత్ర బాధ్యత అని, దాని నుంచి తండ్రి తప్పించుకోలేరని పేర్కొంది. దీంతో సదరు కుమార్తెకు వివాహం అయ్యే వరకు నెలకు రూ.2,500, పెళ్లి ఖర్చుల కోసం రూ.5 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ద్వారా తండ్రి బాధ్యతలను కోర్టు స్పష్టం చేసింది.
Latest News