|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 03:12 PM
కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ 2029 నాటికి పక్కా ఇళ్లు అందించాలనే లక్ష్యంతో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల దరఖాస్తులు రాగా, 7.5 లక్షల మంది అర్హులని ప్రభుత్వం అంచనా వేసింది. వీరికి ఇళ్లు నిర్మించనుండగా, మిగిలిన వారికి స్థలాలు కేటాయించనున్నారు. అలాగే ఈ ఏడాది జూన్ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 10 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వారితో 7.5 లక్షల మంది అర్హులు ఉండవచ్చని తెలిపారు. వీరందరికీ 2029 నాటికి ఇల్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. అప్పటికల్లా శాశ్వత గృహలు నిర్మించి ఇస్తామని పార్థసారధి చెప్పారు. ఇక మిగిలిన 2.65 లక్షల మందికి 2029 నాటికి స్థలాలు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. అటు ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 2.61 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలకు పింపిణీ చేస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణ కోసం హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Latest News