|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 03:31 PM
ఏపీలో పింఛన్‌దారులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే జనవరి 31న పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసి రూ.2,731 కోట్ల నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 62.97 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందించనున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు చొప్పున పింఛన్ అందుతోంది.ఆదివారం సెలవు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, శనివారమే పింఛన్ నగదు అందుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Latest News