|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 03:54 PM
తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ని రాజకీయాల్లోకి లాగడం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో ఆవు, పంది, చేప కొవ్వు వాడారంటూ పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సీబీఐ నెల్లూరు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్ ద్వారా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువులు కొవ్వులు వాడలేదని స్పష్టమైందని తేల్చి చెప్పారు. తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు సహా లోకేష్, పవన్ కళ్యాణ్ లు శ్రీ వేంకటేశ్వరస్వామి వారితో పాటు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Latest News