|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:01 PM
పాలనలో వైఫల్యాలు బయటపడుతున్న వేళ ప్రజల దృష్టి మళ్లించేందుకే దేవదేవుడిని కూడా చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి లాగారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపించారు. ఆ దిశలోనే గత వైయస్ఆర్‌సీపీప్రభుత్వాన్ని నిందిస్తూ, తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపిన నెయ్యి వాడారని ఆరోపణలు, విష ప్రచారం చేశారని.. కానీ, అదంతా అవాస్తవమని ఇప్పుడు తేలిపోయిందని ఆయన వెల్లడించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి నేతలు భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడారని గుర్తు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, 20 నెలల్లోనే రూ.3.10 లక్షల కోట్ల అప్పు చేశారని, అయినా ఒక్కటైనా సంక్షేమ, అభివృద్ధి పథకం అమలు లేదని చెప్పారు. మరి తెచ్చిన అప్పంతా ఏమవుతోందని? ఎక్కడికెళ్తోంది? అని నిలదీశారు. అభివృద్ధి కంటే పబ్లిసిటీకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తారన్న ఆయన, కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, దీంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలం వెళ్లదీస్తున్నారని, ఆ దిశలోనే అదే పనిగా వైయస్ జగన్‌గారి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
Latest News