|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:02 PM
కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని.. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో దేవస్థానాల్లో వరుస అకృత్యాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. దేవస్థానాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ నేతలె కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ... తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అన్న చంద్రబాబు వ్యాఖ్యలు, అదే అదునుగా నానా యాగీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేష్టలు సీబీఐ నివేదిక సాక్షిగా అబద్దాలని తేలిపోయిందన్నారు. కేవలం రాజకీయాల కోసం దేవదేవుడ్ని వాడుకోవడం దారుణమని మండిపడ్డారు. సీబీఐ నివేదికలో అసలు వాస్తవం బయటపడ్డంతో ఉలిక్కపడి.. మరలా దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును ప్రజలు ఎప్పటికీ క్షమించరని తేల్చి చెప్పారు. మరోవైపు స్వామి వారి ప్రసాదంపై పై అపవాదు వేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు... ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు డిమాండ్ చేశారు.
Latest News