|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:44 PM
నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపికబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను ఉగాది నాటికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుని కసరత్తు ముమ్మరం చేసింది. దీని కోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.ప్రతి ఏటా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి, వాటి భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం అన్ని శాఖల నుంచి ఖాళీల జాబితాను తెప్పించుకుంటోంది. అయితే, కొత్త ఉద్యోగాల భర్తీ వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని కూడా జాగ్రత్తగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే జాబ్ క్యాలెండర్‌పై తుది ప్రకటన చేయనున్నారు.
Latest News