|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 11:24 AM
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ జరుగుతోందని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని 49, 29వ డివిజన్లలో కూటమి పార్టీల నాయకులతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ ప్రజల స్పందనను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 1వ తేదీ కంటే ముందే, ఉదయం 8 గంటలలోపు ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందజేస్తున్నామని, చెప్పిన మాట ప్రకారం ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Latest News