రాజ్యసభకు అజిత్‌ పవార్‌ కుమారుడు?
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 11:40 AM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో ఆయన భార్య సునేత్ర పవార్ ఆ పదవిని చేపట్టే అవకాశాలున్నాయని, దీంతో ఆమె ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ స్థానం ఖాళీ అవుతుందని, ఆ స్థానానికి కుమారుడు పార్థ్ పవార్‌ను పంపించే అవకాశం ఉందని ఎన్సీపీ వర్గాల సమాచారం. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవర్‌  ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ స్థానాన్ని పార్థ్‌ భర్తీ చేయనున్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. పార్థ్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇదిలాఉండగా.. ముంబయిలో నేడు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుందని పార్టీ నేత ఒకరు తెలిపారు. ఇందులో సునేత్రను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం కల్లా ఆమె ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేస్తారన్నారు.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM