|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:15 PM
తూర్పు కాంగో రుబాయా ప్రాంతంలోని ఓ Coltan మైన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గని ఒక్కసారిగా కూలిపోవడంతో 200 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌లో వాడే ఈ లోహం కోసం అక్కడ మైనింగ్ జరుగుతోంది. రెబల్స్ కంట్రోల్‌లో ఉన్న ఈ గనుల్లో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఘటనలో ప్రాణనష్టం ఎక్కువగా ఉండటం అందరినీ కలచివేస్తోంది.గని కూలిన సమయంలో అక్కడ కార్మికులు, పిల్లలు, మహిళలు మట్టిలో కూరుకుపోయారు. కొంతమంది గాయాలతో బయటపడగా వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా నేల బలహీనపడి, గని ఒక్కసారిగా కుప్పకూలిందని అధికారులు చెబుతున్నారు. కోల్టన్ వంటి ఖనిజాల కోసం ఇల్లీగల్ గా జరిపే తవ్వకాలు ఈ ప్రమాదానికి కారణం అంటున్నారు. ఉత్తర కిపు ప్రాంతంలోని రుబయా నగరం కోల్టన్ ఉత్పత్తికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
Latest News