|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:26 PM
వైయస్ఆర్‌సీపీ హయాంలో నిర్వహించిన సమగ్ర భూసర్వే కార్యక్రమం ద్వారా శతాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మేలు జరిగేలా వైయస్ జగన్ గారు చేసిన ఈ మహా యజ్ఞానికి కేంద్ర ఆర్థిక సర్వేలో ప్రశంసలు దక్కాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రారంభించిన ఈ యజ్ఞాన్ని రాక్షసుల్లా అడ్డుకోవాలని చూసిన కూటమి నాయకులు.. అధికారంలోకి వచ్చాక మేమే చేశామంటూ క్రెడిట్ చోరీకి పాల్పడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సుదీర్ఘ పాదయాత్రలో తన దృష్టికి లక్షల్లో వచ్చిన భూ సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించాలని తలచి, 2019 వైయస్ఆర్‌సీపీ మేనిఫెస్టోలోనే భూముల రీసర్వే హామీని చేర్చిన విషయాన్ని గుర్తుచేశారు. వైయస్ జగన్ గారు ప్రారంభించిన ఈ సర్వే విధానాలను పరిశీలించాలని గతంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సూచించారని ఆయన వివరించారు. కానీ ఎన్నికల్లో భూముల రీసర్వేపై ప్రజలను తప్పుదోవ పట్టించడంలో సక్సెస్ అయిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత తెగించి జగన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు చేసిన దిగజారుడు వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని జూపూడి ప్రభాకర్ డిమాడ్ చేశారు.
Latest News